: అగ్రిగోల్డ్ పాపమూ... వైఎస్ చలవే!: బొండా ఉమా


లక్షలాది మందికి కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ వ్యవహారం కూడా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనట. ఈ మేరకు నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చకు వైసీపీ పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ వాదనను తిప్పికొడుతూ బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2003 దాకా అగ్రిగోల్డ్ వ్యాపారం విలువ రూ.100 కోట్లు కూడా దాటలేదన్న బొండా ఉమా, వైఎస్ అధికారం చేపట్టగానే ఆ సంస్థ నలుదిశలా విస్తరించిందని ఆరోపించారు. అంతేకాక అనతి కాలంలోనే ఆ సంస్థ వ్యాపారం వేల కోట్లకు చేరిందన్నారు. వైఎస్ అండ చూసుకునే... అగ్రిగోల్డ్ చైర్మన్ ఏవీ రామారావు చక్రం తిప్పారన్నారు. అయితే తాము అధికారంలోకి రాగానే జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ పై కేసులు నమోదు చేశామన్నారు. ఎక్కడెక్కడో ఉన్న సంస్థ ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News