: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం... స్విమ్మింగ్ చేస్తుండగా లంగ్స్ లోకి నీరు చేరిన వైనం
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన హర్షవర్ధన్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లాడు. ఈ క్రమంలో నిన్న అక్కడి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు దిగిన అతడు నీళ్లు తాగేశాడు. దాంతో అవి అతడి ఊపిరితిత్తుల్లోకి చేరాయి. ఈ క్రమంలో ఊపిరి ఆడక అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హర్షవర్ధన్ పరిస్థితిని గమనించిన అతడి స్నేహితులు వేగంగా స్పందించారు. హుటాహుటిన అతడిని అక్కడికి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్షవర్ధన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.