: మన దేశంలో 27 విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత లేదు!
మన దేశంలోని 27 విమానాశ్రయాలకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రత లేదన్న విషయం వెలుగు చూసింది. నిధుల కొరత కారణంగా గత ఐదేళ్లుగా ఈ విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత లేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఈ విమానాశ్రయాల్లో రాష్ట్ర పోలీస్ శాఖ, సీఆర్పీఎఫ్, ఇండియా రిజర్వ్ బెటాలియన్స్, ఇతర బలగాలు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నాయి. ఈ 27 విమానాశ్రయాల్లో 8 అతి సున్నిత, 19 సున్నిత ప్రాంతాల్లో ఉన్నాయి. సీఐఎస్ఎఫ్ ప్రత్యేక భద్రత కొరవడంపై సదరు శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, బెల్జియం రాజధాని బ్రసెల్స్ విమానాశ్రయంలో ఇటీవల జంట పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో మనదేశంలో ఎయిర్ పోర్టులకు భద్రత అంశం తెరపైకి వచ్చింది.