: 'నా వల్ల ఎవరి ప్రార్థనలకు ఇబ్బంది కలగకూడదు' అంటూ ప్రసంగాన్ని ఆపేసిన ప్రధాని


మసీదు నుంచి అజా వినరావడంతో తన వల్ల ఎవరి ప్రార్థనలకు ఇబ్బంది కలగకూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. పశ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ లో ఈరోజు ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తుండగా అక్కడి మసీదు నుంచి అజా వినవచ్చింది. వెంటనే, మోదీ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. రెండు నిమిషాల పాటు ప్రశాంతంగా ఉండాలని అక్కడి వారికి సూచించారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News