: హైదరాబాద్ లో జోరుగా క్రికెట్ బెట్టింగ్ లు
టీ20 ప్రపంచకప్ లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని నాగోల్ లో బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వాహకుడు రాజ్ కుమార్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.