: కుళాయి గుంతలోపడ్డ క్రికెట్ బంతి కోసం వెళ్లి మృతి


కుళాయి గుంతలో పడిన క్రికెట్ బంతి కోసం వెళ్లిన ఒక చిన్నారి అందులో పడి ప్రాణాలు విడిచాడు. కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈరోజు ఈస్టర్ పర్వదినం కావడంతో నాగరాజు కుటుంబం చర్చికి వెళ్లింది. అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. కుటుంబసభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నాలుగేళ్ల చిన్నారి ప్రశాంత్ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుకుంటుండగా, బంతి వెళ్లి నీళ్లతో ఉన్న కుళాయి గుంతలో పడింది. ఆ బంతిని తెచ్చుకోవడానికి వెళ్లిన ప్రశాంత్ అందులో పడి ప్రాణాలు విడిచాడు.

  • Loading...

More Telugu News