: టీ20 మహిళా వరల్డ్ క్రికెట్... 3 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్
టీ20 మహిళా వరల్డ్ క్రికెట్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయింది. హెచ్.కె.మాథ్యూస్, కిషోనా ఎ నైట్, ఎస్.ఎల్.క్వింటైన్ ల వికెట్లు పతనమయ్యాయి. బిస్ట్ బౌలింగ్ లో మాథ్యూస్ అవుట్ కాగా, పాటిల్ బౌలింగ్ లో కిషోనా ఎ నైట్, క్వింటైన్ అవుటయ్యారు. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం క్రీజ్ లో డాటిన్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 8.1 ఓవర్లో 30 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.