: నా అభిమాన హీరో చిరంజీవి: సందీప్ కిషన్
తనకు నచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి అని యువనటుడు సందీప్ కిషన్ చెప్పాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. ‘చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇద్దరూ అంటే నాకు ఇష్టం. వాళ్లిద్దరిలో ఎవరని ప్రశ్నిస్తే మాత్రం.. చిరంజీవిగారు పేరే చెబుతాను’ అని సందీప్ కిషన్ చెప్పాడు. ప్రతి వ్యక్తి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ తప్పవని, తన విషయానికొస్తే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తర్వాత రెండు ఫెయిల్యూర్లు వచ్చాయని, ఆ తర్వాత మళ్లీ సక్సెస్ వచ్చిందని అన్నాడు.