: ప్రభుత్వానికి మరకలు అంటించడమే జగన్ వ్యూహం: బొండా ఉమ


అహర్నిశలూ అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబు సర్కారుకు అవినీతి మరకలు అంటించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ కుతంత్రాలు చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. ఆయన పార్టీ సభా సమయాన్ని వృథా చేస్తోందని నిప్పులు చెరిగిన ఉమ, జగన్ కు అవిశ్వాసం, రోజా అంశం తప్ప ప్రజా సమస్యలు ఏవీ గుర్తుకు రావడం లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని పక్కన బెట్టబోమని, అమరావతిలో ప్రజా రాజధానిని నిర్మించి తీరుతామని చెప్పారు. జగన్ ను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని, ఆయన వైఖరితో ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి ఏకాకిగా మిగిలిపోనున్నారని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News