: నేను పార్టీని మారడం లేదు: జ్యోతుల నెహ్రూ


తాను పార్టీ మారతారని వస్తున్న వార్తలపై జ్యోతుల నెహ్రూ స్పందించారు. ప్రస్తుతానికి తాను పార్టీని మారబోవడం లేదని ప్రకటించారు. తన అనుచరుల్లో ఒకరైన వరుపుల సుబ్బారావు వైకాపాను వీడుతున్నట్టు ప్రకటించగా, ఆపై కొద్ది సేపటికే జ్యోతుల పార్టీని వీడటం లేదని చెప్పడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరే విషయమై తాను ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని మీడియా ముందు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. జ్యోతుల వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News