: ధోనీపై మరోసారి నోరు పారేసుకున్న యువరాజ్ తండ్రి


భారత జట్టు క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి నోరు పారేసుకున్నాడు. రెండేళ్ల క్రితం యువరాజ్ ను జట్టు నుంచి తప్పించిన తరువాత, అందుకు ధోనీ కుట్రే కారణమని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన యోగరాజ్, మరోసారి అదే తరహా మాటలు మాట్లాడారు. "రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన నా కొడుకు తిరిగి జట్టులోకి వచ్చాడు. అద్భుతం. కానీ అతన్ని 7వ స్థానానికి నెట్టేయడం ఏంటి? కెప్టెన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? టీములో మార్పులు సహజమే. కానీ ఇక్కడ అసహజంగా కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై బాధ పడవద్దని, నీ సమయం వస్తుందని నా కుమారుడికి చెప్పాను. రెండేళ్లు జట్టుకు దూరమైతే ధోనీ తిరిగి జట్టులోకి రాగలడా?" అని ప్రశ్నించారు. సరైన సమయంలో యువరాజ్ కు బౌలింగ్ చేసే అవకాశాలను సైతం ధోనీ ఇవ్వడం లేదని ఆరోపించారు. 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ 15 వికెట్లు తీశారని గుర్తు చేస్తూ, యువరాజ్ జట్టులో ఉండటం ఇష్టం లేకుంటే, ఆ విషయాన్ని సెలక్టర్లకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News