: దేవాలయంలో వృద్ధ భక్తుడిపై బీజేపీ ఎంపీ ప్రతాపం!
గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ విఠల్ రాడియా వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలోని ఓ దేవాలయంలో భజన చేస్తున్న వృద్ధుడిని కాళ్లతో పదే పదే తన్నుతూ వీడియోకు చిక్కాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ, సదురు వీడియో నేడు బహిర్గతమైంది. ఇతర భక్తులంతా చూస్తుండగానే, కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని కాళ్లతో తన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్దిస్తూ అడిగాడు. దీంతో ఆయన అనుచరులు తాము సైతం అంటూ, వృద్ధుడిని తన్నుకుంటూ బయటకు లాక్కెళ్లారు. ఇప్పుడు విఠల్ రాడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ రాడియాపై ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి. 2012లో రాడియా ఓ టోల్ బూత్ ఉద్యోగిని తుపాకితో బెదిరించిన వీడియో అప్పట్లో హల్ చల్ చేసింది.