: ఫోన్ చేస్తే చాలు... రైలు టికెట్ రద్దు చేసుకోవచ్చు!


వచ్చే నెల 2వ తేదీ నుంచి రైల్వే టికెట్లను ఓ ఫోన్ చేయడం ద్వారా రద్దు చేసుకునే సదుపాయం ప్రయాణికులకు దగ్గర కానుంది. నిర్ణీత గడువు ముగిసేలోగా, కౌంటర్ల వద్దకు వెళ్లి, గంటల తరబడి నిలబడి క్యాన్సిల్ చేసుకోవడం తమకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 139కు డయల్ చేసి, టికెట్ రద్దు ఆప్షన్ ఎంచుకుని పీఎన్ఆర్ ను డయల్ చేయడం ద్వారా, ఓ (ఓటీపీ) వన్ టైమ్ పాస్ వర్డ్ ని పొందవచ్చని, ఆపై అదే రోజు ఎప్పుడైనా వెళ్లి టికెట్ రద్దు చేసుకుని డబ్బు తీసుకోవచ్చని వివరించారు. కాగా, ఇటీవల మారిన నిబంధనలతో టికెట్ రద్దు క్లిష్టతరమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News