: నేడే పార్టీ మారే ప్రకటన... కార్యకర్తలతో చర్చిస్తున్న జ్యోతుల
వైకాపా నుంచి తెలుగుదేశంలోకి మారే విషయంలో జ్యోతుల నెహ్రూ మనసు చెప్పిన మాటనే వినాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా వచ్చి నచ్చజెప్పినా ఆయన వినలేదు. చెవిరెడ్డి వెళ్లగానే, నియోజకవర్గ నేతలను, కార్యకర్తలను తన ఇంటికి పిలిపించిన జ్యోతుల ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వారితో చర్చిస్తున్న జ్యోతుల, కాసేపట్లో బయటకు వచ్చి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన ఇంటి ముందు భారీ ఎత్తున కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు వేచి చూస్తున్నారు.