: కుమార్తె కోసం టైలరింగ్ చేస్తున్న డేవిడ్ బెక్ హామ్!
ఇంగ్లండ్ ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బెక్ హామ్ తమ కుమార్తె హార్పర్ కోసం టైలర్ గా మారాడు. సూది పట్టి ఓ అందమైన డ్రస్ కుట్టడానికి స్వయంగా ఉపక్రమించాడు. ఇప్పటికే తన కూతురి బొమ్మకు ఓ మంచి గౌన్ కుట్టించిన డేవిడ్, ఇప్పుడు ఆమె కోసమే డ్రస్ డిజైన్ చేస్తున్నాడు. ఇక డేవిడ్ డ్రస్ కుడుతున్న చిత్రాన్ని తీసిన ఆయన భార్య విక్టోరియా, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. డేవిడ్ బెక్ హామ్ ను అందరూ 'గ్రేట్ డాడీ' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ చిత్రాన్ని మీరూ చూడండి.