: ఉదయం నుంచి జ్యోతుల నెహ్రూ ఇంటి ముందు చెవిరెడ్డి పడిగాపులు!
వైకాపా నుంచి జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి ఫిరాయిస్తున్నారని వార్తలు వస్తున్న వేళ, ఈ ఉదయం నుంచి వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్యోతుల ఇంటి ముందు ఆయన్ను కలిసే నిమిత్తం పడిగాపులు పడుతున్నారు. ఈ ఉదయం జగ్గంపేట నియోజకవర్గంలోని నెహ్రూ స్వగ్రామం ఇరిపాకలోని నివాసానికి చెవిరెడ్డి వెళ్లగా, కలిసేందుకు జ్యోతుల నెహ్రూ నిరాకరించినట్టు తెలిసింది. చెవిరెడ్డి వచ్చారన్న వార్తను నెహ్రూకు చేరవేయగా, కలవాల్సిన అవసరం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్టు జ్యోతుల అనుచర వర్గాలు వెల్లడించాయి. స్నేహం వేరు, రాజకీయం వేరని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఒక్క 5 నిమిషాలు తనకు సమయం ఇవ్వాలని చెవిరెడ్డి పదే పదే సమాచారం పంపుతున్నారు.