: భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫిక్సయింది... విచారణకు పాక్ మాజీ క్రికెటర్ డిమాండ్!


మూడు బంతుల్లో రెండు పరుగులు చేసి విజయం సాధించే అవకాశాలు ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఓడిపోవడం తనకు అనుమానాలు కలిగిస్తోందని, ఈ విషయంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం, భద్రతాధికారులు దర్యాప్తు చేయాలని పాక్ మాజీ స్పిన్నర్ తౌసిఫ్ అహ్మద్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తరఫున 34 టెస్టులు, 70 వన్డేలు ఆడిన తౌసిఫ్, ఈ మ్యాచ్ ని బంగ్లాదేశ్ జట్టు, భారత్ కు బహుమతిగా అందించిందని అన్నారు. "మ్యాచ్ ముగిసిన తీరు ఎన్నో అనుమానాలు కలిగిస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరిపించాలి" అని జియో సూపర్ చానల్ కు ఆయన తెలిపారు. జట్టు ఆటగాళ్లేమీ అనుభవరాహిత్యులు కాదని, క్రీజులో మంచి ఆటగాళ్లుండీ ఇలా చేయడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు.

  • Loading...

More Telugu News