: ఎమ్మెల్యేలు, మంత్రుల కారణంగా టీడీపీకి నష్టం: సొంత పార్టీపై జేసీ సంచలన వ్యాఖ్య


ఎమ్మెల్యేలు, మంత్రుల చేతగానితనంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు తగ్గుతోందని, పార్టీ గ్రాఫ్ పడిపోతోందని సొంత పార్టీపైనే జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉంటున్నారని, సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల చంద్రబాబు అలసత్వం చూపుతున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబుతో చాలాసార్లు చెప్పి చూశానని, పార్టీల్లో దిగజారుడుతనం పెరిగిందని వివరించారు. అందరూ కలసి కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్న జేసీ, పనిలోపనిగా వైకాపాపైనా విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటోందని దుయ్యబట్టారు. అసెంబ్లీ సజావుగా సాగి, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా చేయాల్సిన బాధ్యత వైకాపాదేనని హితవు పలికారు.

  • Loading...

More Telugu News