: భర్తను తిట్టినందుకు విడాకులు సబబే: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు


భర్తను గున్న ఏనుగు, చేతగానివాడు అంటూ తిట్టడం అతని ఉత్సాహాన్ని దెబ్బతీయడం, ఆత్మగౌరవాన్ని భంగపరచడమేనని, ఈ కారణాలతో విడాకులు మంజూరు చేయడం సబబేనని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. తాను లావుగా ఉన్నానని, భార్య లైంగిక కోరికలను తీర్చలేకపోతున్నందున ఆమె తిట్టి హింసిస్తున్న కారణంగా విడాకులు ఇవ్వాలని ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, నాలుగేళ్ల క్రితం విడాకులు మంజూరయ్యాయి. అయితే, భార్య ఆ తీర్పును కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. తాను భర్తను తిట్టిన తేదీలు, ప్రత్యేక సందర్భాలూ లేవని ఆమె చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. భార్యా భర్తల బంధంలో తప్పు ఎక్కడ జరిగిందన్న చిట్టా పద్దులు అవసరం లేదని వ్యాఖ్యానించింది. విడాకులు సబబేనని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News