: సిగ్నల్ వైర్లు కట్ చేసి, అనంతపురం జిల్లాలో రైలు దోపిడీ


అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఈ తెల్లవారుఝామున రైలు దోపిడీ జరిగింది. దొంగలు పక్కాగా ప్లాన్ వేసి హుబ్లీ, మైసూలు రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. రైలు ఆగిపోతుందన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్ శివార్లలోని సిగ్నల్ వైర్లను దొంగలు కట్ చేశారు. దీంతో రైలు ఆగగా, దాదాపు 20 మందికి పైగా దొంగలు విరుచుకుపడ్డారు. మూడు బోగీల్లోకి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. కత్తులతో బెదిరిస్తూ, అందినకాడికి లాక్కెళ్లారు. దోపిడీ జరిగినట్టుగా గార్లదిన్నె రైల్వే పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో దోపిడీ జరిగిందని, తమ నుంచి బంగారు ఆభరణాలు, నగదు లాక్కెళ్లారని వారు ఫిర్యాదు చేశారు. సిగ్నల్ వైర్ల మరమ్మతుల అనంతరం రైలు కదలగా, బెంగళూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News