: తిరుమల పుష్కరిణిలో మృతదేహం... భక్తుల్లో ఆందోళన!


పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి పుష్కరిణిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. దాదాపు రెండు రోజుల క్రితమే ఇతను మరణించి ఉండవచ్చని తెలుస్తోంది. గత అర్ధరాత్రి మృతదేహం పైకి తేలడంతో అక్కడే స్నానాలు చేస్తున్న భక్తులు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని అశ్వని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్కరిణిలోని నీటిని బయటకు పంపి శుద్ధి చేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News