: మంత్రి పల్లెకు ఉద్వాసన?... రేసులో బాలయ్య!


ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న వేళ, మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని వార్తలు వస్తుండగా, తనకు క్యాబినెట్ బెర్త్ కావాలని హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే, పనితీరు అంతంతమాత్రంగా ఉన్న పల్లె రఘునాథరెడ్డిని తప్పించవచ్చని తెలుగుదేశం వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సొంత జిల్లా అధికారులపై సైతం ఆయన పట్టు సాధించలేక పోయారని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీతపైనా ఆయన కోపంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆమె పదవికి ఢోకా లేదని సమాచారం. ఇక ఎవరిని తొలగించినా, తొలగించకున్నా తనకో మంత్రి పదవి కావాలని బాలయ్య కోరుకుంటున్నారట. బాలయ్యతో పాటు వైకాపా టికెట్ పై గెలిచి, తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు పోటీలో ఉన్నారు. వీరితో పాటు సీఎం కుమారుడు లోకేశ్ కు బెర్త్ లభించవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ లేదా బాలకృష్ణకు మంత్రి పదవి లభిస్తే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు ఛాన్స్ లభించకపోవచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News