: రాహుల్ తప్పు చెప్పారు... బీఎస్పీ లేదా ఎస్పీతో జత కట్టేది లేదు: స్పష్టం చేసిన కాంగ్రెస్


యూపీలో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో భాగంగా బహుజన సమాజ్ వాదీ పార్టీ లేదా సమాజ్ వాదీ పార్టీతో జట్టు కట్టే ఆలోచనేదీ లేదని ఆ పార్టీ కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు పొరపాటున పొత్తు యత్నాలపై వ్యాఖ్యానించారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ అంగీకరిస్తే, పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలతో డీల్ కుదుర్చుకున్నట్టే మాయావతి పార్టీతో సీట్ల పంపకం ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమకు పొత్తు ఆలోచనేదీ లేదని, యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని యోచిస్తున్నామని మిస్త్రీ వెల్లడించారు. కాగా, యూపీలో 27 సంవత్సరాల క్రితం అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఆపై తిరిగి నిలవలేకపోయింది. మండల్ ఇష్యూ, బాబ్రీ మసీదు కూల్చివేత తదితర ఘటనలతో, కాంగ్రెస్ కుదేలు కాగా, అనూహ్యంగా ఎదిగిన బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో కీలకంగా మారింది.

  • Loading...

More Telugu News