: పాక్ పై ఆధారపడ్డ మన మహిళా క్రికెట్ టీమ్... ఛాన్స్ దక్కేనా!


వరల్డ్ కప్ టీ-20 పోటీలు కీలక దశకు చేరుకున్న వేళ, భారత పురుషుల, మహిళల జట్లు నేడు కీలకమైన మ్యాచ్ లను ఆడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా పురుషుల జట్ల మధ్య పోరు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు సెమీఫైనల్ కు, ఓడిన జట్టు ఇంటికి వెళ్లనుంది. ఇదే సమయంలో భారత మహిళల జట్టు మిధాలీ కెప్టెన్సీలో వెస్టిండీస్ తో తలపడనుంది. మహిళల విషయంలో గణాంకాలు, సమీకరణాలు ఆసక్తిగా ఉన్నాయి. మహిళల జట్టు సెమీస్ కు వెళ్లాలంటే కచ్చితంగా వెస్టిండీస్ పై గెలవాల్సి వుంటుంది. ఆపై ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవాలని కోరుకోవాలి. అప్పుడు భారత్ కు అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఇండియాతో పాటు వెస్టిండీస్, పాక్ రెండేసి విజయాలతో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఇంగ్లండ్ జట్టు బలంగా ఉండటంతో పాక్ విజయం అంత సులువేమీ కాదని క్రీడా పండితుల అంచనా. ఇదే సమయంలో భారత జట్టు వెస్టిండీస్ ను ఓడించే అవకాశాలు ఉండటంతో, మహిళల జట్టు సెమీఫైనల్ ఆశలు ఇప్పటివరకూ సజీవంగానే ఉన్నట్టు చెప్పుకోవాలి.

  • Loading...

More Telugu News