: నిఖిల్ ని ఆటాడుకున్న మంచు విష్ణు, రాజ్ తరుణ్!
హైదరాబాదులోని తాజ్ డెక్కన్ లో జరిగిన 'ఆడో రకం...ఈడో రకం' చిత్రం ఆడియో వేడుకలో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు సహనటుడు నిఖిల్ ను ఆటపట్టించారు. ఆడియో వేడుకలో పాటను ఆవిష్కరించేందుకు వచ్చిన నిఖిల్ ఫార్మాలిటీ కోసం కొన్ని మాటలు చెప్పాడు. దీంతో విష్ణు, రాజ్ తరుణ్ కల్పించుకుని ఆడియో వేడుకల్లో రెగ్యులర్ గా వాడే పదాలు కాకుండా, కొత్త పదాలు వాడాలని సూచించారు. దీంతో వారిద్దరూ తనను ఎగతాళి చేస్తున్నారని భావించిన నిఖిల్...మంచు విష్ణును ఏమీ అనలేక...రాజ్ తరుణ్ ను హెచ్చరించాడు. 'రాజ్ తరుణ్! నీ బుర్ర కంటే నా బుర్ర చాలా క్రేజీ...నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు' అంటూ చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ చేతులూపాడు.