: బౌలింగ్ లో లంకేయులు...బ్యాటింగ్ లో ఇంగ్లండ్ ఆకట్టుకుంది
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక-ఇంగ్లండ్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో బ్యాట్స్ మన్, బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. ఓపెనర్ హేల్స్ డక్ అవుట్ కావడంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు జాగ్రత్తలో పడిపోయారు. మరో ఓపెనర్ రోయ్ (41) ధాటిగా ఆడగా, జోరూట్ (25) ఆచితూచి ఆడాడు. అనంతరం వచ్చిన బట్లర్ (9) భారీ షాట్లకు ప్రయత్నిస్తున్నాడు. కాగా, ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేసేందుకు పూర్తి సన్నద్దమైన లంకేయులు అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. దీంతో 12 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.