: బీజేపీలో చేరిన శ్రీశాంత్...తిరువనంతపురం నుంచి పోటీ!
స్పాట్ ఫిక్సింగ్ కేసులో జైలు జీవితాన్ని అనుభవించడమే కాకుండా, నిషేధానికి కూడా గురైన క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు రాజకీయాల బాట పట్టాడు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీశాంత్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. తనపై ఎప్పట్లా ప్రేమ చూపించాలని కోరాడు. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నాడు. క్రికెట్ లో ఎలా ప్రతిభను నిరూపించుకున్నానో రాజకీయాల్లో కూడా అలాగే నిరూపించుకుంటానని శ్రీశాంత్ చెప్పాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్లీన్ చిట్ లభించడంతో తన రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు. తిరువనంతపురం నియోజకవర్గం నుంచి శ్రీశాంత్ బరిలో దిగుతాడని కేరళ బీజేపీ తెలిపింది.