: ధోనీ కామెంట్లను ఉదాహరిస్తూ... ప్రజలను క్షమాపణలు కోరిన బంగ్లా ఆటగాడు
భారత్ తో మ్యాచ్ లో తాను ఆడిన షాట్ ఓటమికి కారణం అయిందంటూ బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీం ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ప్రజలు తనను క్షమించాలని ఆయన కోరాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గతంలో చేసిన...'బిగ్ షాట్ ఆడి మ్యాచ్ ను ముగించాలి. అయితే అలాంటి షాట్ ఆడేముందు చేతిలో వికెట్లు ఉన్నాయా? లేదా? అన్న విషయం సరిచూసుకోవాలి. ఈ షాట్ ద్వారా తాను అవుటైనా తరువాత వచ్చే ఆటగాడు మ్యాచ్ ను ఫినిష్ చేస్తాడని భావించినప్పుడు బిగ్ షాట్ ఆడడంలో తప్పులేదు' అంటూ చేసిన వ్యాఖ్యలను రహీం ట్వీట్ చేశాడు. తానా షాట్ ఆడడం వల్లే అవుటయ్యానని, తన తరువాత వచ్చిన ఆటగాళ్లు కూడా భారీ షాట్లకు యత్నించి అవుటయ్యారని, దీంతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ముష్ఫికర్ రహీం తెలిపాడు.