: 'ఐ' ఫ్యాన్ సరికొత్తది...కేరళ విద్యార్థుల ఆవిష్కరణ


కేరళ విద్యార్థులు సరికొత్త ఫ్యాన్ ను ఆవిష్కరించారు. 'ఐ' ఫ్యాన్ రెగ్యులేటర్ గా పిలిచే ఈ పరికరం గదిలో ఉష్ణోగ్రతను సరిచేస్తుందని దీని ఆవిష్కర్తలు తెలిపారు. 350 రూపాయల విలువ చేసే ఈ పరికరం 2.5 అంగుళాల తెరను కలిగి ఉంటుంది. దీనితో అనుసంధానమైన ఫ్యాన్ ఆన్ చేయగానే గది ఉష్ణోగ్రతను చూపుతుందని వారు తెలిపారు. గది ఉష్ణోగ్రతను సాధారణ స్థాయికి తెచ్చేందుకు తనంత తానుగా సర్దుబాట్లు చేసుకుంటుంది. గది ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చిన తరువాత తనంత తానుగా ఆగిపోతుంది. తరువాత ఉష్ణోగ్రత పెరిగితే తనంత తానుగా ఆన్ అవుతుందని వారు వెల్లడించారు. ఈ ఐ ప్యాన్ పరికరాన్ని వర్షాకాలంలోపు అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రయత్నాలు ప్రారంభించామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News