: ఆ వార్తలు తప్పు...అది ఫాంహౌస్ పార్టీ: సినీ నటుడు బ్రహ్మాజీ
యువనటుడు నవదీప్ రేవ్ పార్టీ చేసుకున్నాడంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తెలిపాడు. నవదీప్ రేవ్ పార్టీపై వచ్చిన వార్తలను బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా ఖండించాడు. అది ఫ్యామిలీలతో జరుపుకున్న ఫాంహౌస్ పార్టీ అని స్పష్టం చేశాడు. ఆ పార్టీకి తాను కుటుంబ సమేతంగా వెళ్లానని చెప్పాడు. మీడియాలో వచ్చినట్టు నవదీప్ ఫాం హౌస్ లో జరిగినది రేవ్ పార్టీ కాదని ఆయన చెప్పాడు. మీడియా అభూతకల్పనను ప్రచారం చేసిందని బ్రహ్మాజీ తెలిపాడు. రేవ్ పార్టీ జరిగిందన్న వార్తలపై నవదీప్ కూడా ట్విట్టర్ సాక్షిగా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.