: బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ సేవా కార్యక్రమాలకు రూ.5ల‌క్ష‌లు ఇచ్చిన హృతిక్ రోష‌న్


బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలందుకుంటోంది. ఈ ఈ విషయంలో ఆమె చొరవను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అభినందించారు. అంతేకాదు.. జాక్వలిన్ సామాజిక సేవా కార్యక్ర‌మానికి ఐదు ల‌క్ష‌ల‌ రూపాయిల చెక్ కూడా పంపించాడు. చెన్నైన‌గ‌రాన్ని ఇటీవ‌ల వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి, అందుకోసం విరాళాలను సేకరిస్తోంది జాక్వలిన్ ఫెర్నాండెజ్. ఇప్ప‌టికే చెన్నై వచ్చిన ఆమె వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించింది, అక్కడ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆమెను ప్ర‌శంసిస్తూ ఐదు లక్షల రూపాయిల చెక్ పంపించాడు. ఈ విష‌యాన్ని తెలుపుతూ 'ఇదే నాకు బెస్ట్ గిఫ్ట్' అంటూ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ట్విట్ట‌ర్‌లో సంతోషాన్ని వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News