: తక్కువ రేటుకే కరెంట్ దొరుకుతున్నా, ఎక్కువ రేటుకు కొనడమెందుకు?: వైఎస్ జగన్ ప్రశ్న


ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు జరుగుతున్న కసరత్తుపై అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అంశంపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన జగన్... అధికార పక్షాన్ని నిలదీశారు. తక్కువ ధరకే విద్యుత్ లభ్యమవుతున్నా, ఎక్కువ రేటుకు ఎందుకు కొంటున్నారని ఆయన నిలదీశారు. అయినా విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రతిపాదిస్తున్న ఏపీఈఆర్సీని ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజీ తప్పుబడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ తప్పుబడుతున్నా రాష్ట్ర సంస్థ చేస్తున్న సిఫారసులను ఎలా అనుమతిస్తారని కూడా జగన్ అధికార పక్షాన్ని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలను ప్రభుత్వం దారుణంగా పెంచేందుకే సన్నాహాలు చేస్తోందని, ఇది సరైన పధ్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News