: రెండేళ్లకే టీడీపీ పని అయిపోయిందట!... కేంద్ర మాజీ మంత్రి కోట్ల కామెంట్
ఏపీలో టీడీపీ ప్రభుత్వం పని అయిపోయిందట. అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లకే టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందట. ఏ వైసీపీకి చెందిన నేతో చేసిన ఆరోపణ కాదు ఇది. రాష్ట్ర విభజనతో ప్రజలకు దూరమైపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న కర్నూలు జిల్లా గూడూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన అక్కడి లోకల్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.