: చంద్రబాబుకు శ్రీజ వివాహ ఆహ్వానపత్రిక... స్వయంగా అందజేసిన అల్లు అరవింద్


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందింది. నేటి ఉదయం చిరంజీవి బావ, టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనకు పెళ్లి పత్రికను అందజేశారు. శ్రీజ పెళ్లికి తప్పనిసరిగా హాజరు కావాలని చంద్రబాబును అరవింద్ కోరారు. బెంగళూరులోని చిరంజీవి ఫాంహౌస్ లో శ్రీజ వివాహం ఈ నెల 28న జరగనున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ నెల 31న హైదరాబాదులో సదరు పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News