: అస్సాం టీ తాగిన వెంటనే ఎంతో ఉత్తేజం వస్తుంది: అస్సాంలో మోదీ


అస్సాంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టిన్‌సుకియాలో త‌న‌దైన శైలిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌సంగిస్తున్నారు. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని, అస్సాం టీ తాగిన వెంటనే ఎంతో ఉత్తేజం వస్తుందని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. తాను చిన్నతనంలో అస్సాం టీనే విక్రయించేవాడినని అన్నారు. అనంత‌రం, తన పోరాటం ఆ రాష్ట్ర సీఎం తరుణ్ గగోయ్‌పై కాదని, పేదరికం-అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని మోదీ అన్నారు. స్వాతంత్ర్యోద్యమ రోజుల్లో అస్సాం సస్యశ్యామలంగా వెలిగిందని, ఇప్పుడు అది పేద రాష్ట్రంగా మారిందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా మోదీ.. బీజేపీ అభ్య‌ర్థి సర్బానంద్ పై ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News