: ఏపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనం రూ.2 లక్షలు!... సభకు ఎమెనిటీస్ కమిటీ సిఫారసు


తెలంగాణ మాదిరే ఏపీలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం భారీగా పెరగనుంది. ఈ మేరకు నేటి ఉదయం అసెంబ్లీ మీటింగ్ హాల్ లో సమావేశమైన ఏపీ అసెంబ్లీ ఎమెనిటీస్ కమిటీ సభకు స్పష్టమైన సిఫారసులు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలకు అందుతున్న రూ.90 వేల వేతనాన్ని ఒకేసారి రూ.2 లక్షలకు పెంచాలని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఇందులో రూ.1.5 లక్షలు వేతనం కాగా, రూ.50 వేలను అలవెన్సులుగా అందజేయాలని సూచించింది. ఇక వాహన రుణాన్ని రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని కూడా సిఫారసు చేసింది. కమిటీ సిఫారసులకు సభ ఆమోదం లభించగానే... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు పెరగనున్నాయి.

  • Loading...

More Telugu News