: సవాళ్ల పర్వం!... రోజాకు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే అనిత


వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన సస్పెన్షన్ కు దారి తీసిన వ్యవహారంపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టిన రోజా... టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. తనపై అకారణంగా సస్పెన్షన్ విధించారని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి వచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనిత... రోజాపై విరుచుకుపడ్డారు. నిండు సభ సాక్షిగా తనను దూషించలేదని రోజా చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆమె ఆరోపించారు. రోజా చేసిన ఆరోపణల్లో వాస్తవముందని తేలితే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. అదే సమయంలో సభలో తనను దూషించినట్లు తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని ఆమె రోజాకు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News