: ఇంటర్నెట్ యూజర్లపై పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల నిఘా


ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతుండడం, ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఇంటర్నెట్ యూజర్ల ఆచూకీ తెలుసుకుంటున్నాయి. ముఖ్యంగా యూజర్ల సమాచారం తెలియజేయాలంటూ గూగుల్ కు 2012 జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 2,431 అభ్యర్థనలు వచ్చాయి. ఈ విషయాన్ని గూగుల్ వెల్లడించింది. 4,106 మంది అకౌంట్ల సమాచారాన్ని తెలియజేయాలని అవి కోరాయి. అంతకుముందు కాలంలో పోలిస్తే 4శాతం అధిక అభ్యర్థనలు వచ్చాయని గూగుల్ తెలిపింది.

  • Loading...

More Telugu News