: కాంగ్రెస్ చర్చ కంటే రచ్చ చేయడానికే ఆసక్తి చూపుతోంది: హరీశ్‌రావు
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ పద్దులపై నాలుగో రోజూ శాసనసభలో చర్చ కొనసాగనుంది. రెవెన్యూ రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, వాణిజ్య పన్నుల పద్దులపై నేడు చర్చ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సభా సంప్రదాయాల మేరకు చర్చకు సిద్ధమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సభ సజావుగా సాగడానికి ప్రతి పక్షానికి ఇష్టం లేనట్లుందని విమర్శించారు. కాంగ్రెస్ చర్చ కంటే రచ్చ చేయడానికే ఆసక్తి చూపుతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఏ అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగేందుకు కాంగ్రెస్ సహకరించాలని కోరారు.