: ఆనంద గజపతిరాజు ఇక లేరు!... అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎంపీ


అభినవ ఆంధ్ర భోజుడిగా పేరుగాంచిన విజయనగరం రాజవంశానికి చెందిన పూసపాటి ఆనంద గజపతిరాజు ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఆయన కొద్దిసేపటి క్రితం మణిపాల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. విజయనగర రాజ వంశానికి చెందిన ఆనంద గజపతిరాజు... ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు స్వయానా సోదరుడు. గతంలో లోక్ సభ సభ్యుడి(ఎంపీ)గానే కాక మంత్రిగానూ ఆనంద గజపతిరాజు పనిచేశారు. ప్రస్తుతం సింహాచలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తగా ఉన్న ఆనంద గజపతిరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆయన నేటి ఉదయం కన్నుమూశారు.

  • Loading...

More Telugu News