: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ... ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ డిమాండ్లపై చర్చ
వరుస సెలవుల తర్వాత ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రోజా సస్పెన్షన్ ను సింగిల్ బెంచ్ కొట్టివేసిన నేపథ్యంలో గడచిన వారంలో విపక్ష సభ్యుల నిరసనలతో సభ హోరెత్తింది. అయితే రోజా సస్పెన్షన్ పై చట్టసభదే తుది నిర్ణయమంటూ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో విపక్షం నేటి సమావేశాల్లో పెద్దగా ఆందోళనకు దిగే అవకాశాలు లేవు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించిన డిమాండ్లపై చర్చ జరగనుంది.