: ఎల్బీ స్టేడియంలో ‘రన్ ఫర్ జీసెస్’... ఉత్సాహంగా పాల్గొన్న కల్వకుంట్ల కవిత


హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ‘రన్ ఫర్ జీసెస్’ పేరిట ప్రత్యేక పరుగు ప్రారంభమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైస్తవుల దైవం యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన రోజుకు ముందుగా జరుపుకునే ఈస్టర్ నేపథ్యంలో ఈ రన్ ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా పాలుపంచుకోవాలని, తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. రన్ ను ప్రారంభించిన కవిత కొద్దిదూరం యువతతో కలిసి పరుగు తీశారు.

  • Loading...

More Telugu News