: 900 ఎకరాల్లోనే అమరావతి ప్రధాన భవనాలు!


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా 34 వేల ఎకరాలకు పైగా భూములను సేకరించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించిన ఈ భూమిలో అత్యద్భుత రాజధానిని నిర్మించడమే లక్ష్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాలకు సంబంధించిన మాస్టర్ డెవలపర్ ను చంద్రబాబు ఎంపిక చేశారు. జపాన్ కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘మాకీ’ ఇందుకోసం ఎంపికైంది. వేలాది ఎకరాల భూమిలో కేవలం 900 ఎకరాల్లోనే అమరావతి ప్రధాన నిర్మాణాలను నిర్మించాలంటూ ‘మాకీ’ పకడ్బందీగా రూపొందించిన ప్రణాళికకు చంద్రబాబు ఓకే చెప్పేశారు. ఈ 900 ఎకరాల్లోనూ 70 శాతం విస్తీర్ణాన్ని జలవనరులు, పచ్చదనం కోసమే వినియోగిస్తారు. వెరసి చంద్రబాబు భావిస్తున్న ‘బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్’లో ప్రభుత్వం విజయవంతంగా తొలి అడుగు వేసినట్టయింది.

  • Loading...

More Telugu News