: 'జై బాలయ్య' అంటూ నినదించిన నారా రోహిత్


'జై బాలయ్య' అంటూ 'రాజా చెయ్యి వేస్తే' హీరో నారా రోహిత్ నినదించాడు. విజయవాడలో నిర్వహించిన 'రాజా చెయ్యి వేస్తే' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తనను ప్రోత్సహిస్తున్న పెదనాన్నకు, బాలయ్యబాబుకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా అద్భుతంగా వచ్చేందుకు నిర్మాత సాయి కొర్రపాటి ఎంతో సహకారం అందించారని ఆయన అన్నారు. అన్ని వేళలా తానున్నానంటూ ఆయన ప్రోత్సాహమందించారని రోహిత్ చెప్పారు. సాంకేతిక వర్గం మొత్తం కష్టపడ్డారని, సినిమా క్వాలిటీతో వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని ఆయన తెలిపారు. పాటలు అభిమానులను అలరిస్తాయని ఆయన చెప్పారు. ఆడియో వేడుకకు వచ్చిన అందరికీ ధన్యవాదాలని తెలిపిన రోహిత్...పెదనాన్న (చంద్రబాబునాయుడు) పక్కన ఉండగానే 'జై బాలయ్య' అంటూ నినదించాడు.

  • Loading...

More Telugu News