: సఫారీలు తేలిపోయారు...విండీస్ లక్ష్యం 123


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సఫారీలు తేలిపోయారు. విండీస్ బౌలర్ల ధాటికి దాసోహమైన సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ 122 పరుగులు మాత్రమే చేయగలిగారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ హషీమ్ ఆమ్లా (1), తరువాత డుప్లెసిస్ (9), ఆ వెనుకే రోసోవ్ (0) ఇలా ముగ్గురు పెవిలియన్ చేరారు. అనంతరం డివిలియర్స్ (10), డుప్లెసిస్ (1) కూడా విఫలమయ్యారు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి సఫారీలు ఐదు వికెట్లు కోల్పోయారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పట్టుదల ప్రదర్శించిన డికాక్ (47) అర్ధసెంచరీకి చేరువలో అవుటయ్యాడు. అనంతరం వైస్ (28), మోరిస్ (16) కాసేపు విండీస్ బౌలర్లను ప్రతిఘటించారు. ఫంగిసో (4) పెవిలియన్ చేరడంతో సఫారీల ఇన్నింగ్స్ 122 పరుగుల వద్ద ముగిసింది. దీంతో 8 వికెట్లు కోల్పోయిన సఫారీలు విండీస్ కు 20 ఓవర్లలో 123 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించారు. విండీస్ బౌలర్లలో గేల్, రస్సెల్, బ్రావో చెరో రెండు వికెట్లతో రాణించారు. 123 పరుగుల విజయలక్ష్యంతో వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్ లో అద్భుతమైన 5వ బంతిని సంధించి గేల్ ను రబాడా అవుట్ చేశాడు.

  • Loading...

More Telugu News