: నా పుట్టిన రోజుకు ముందు గ్రామస్తుల దాహార్తి తీర్చాను: ప్రకాశ్ రాజ్


తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు గ్రామస్తుల దాహార్తిని తీర్చానని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిని ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, తాగు నీటి కొరత ఉన్న అదే జిల్లాలోని కమ్మదనం గ్రామంలో బోర్ వేయించానని, తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ విధంగా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధి విషయంలో సహకరిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి తన కృతజ్ఞతలని మరో ట్వీట్ లో ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కాగా, సామాజిక బాధ్యతతోనే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నానని గతంలో ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News