: 'రాజా చెయ్యివేస్తే' ఆడియో వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బాలయ్య
'రాజా చెయ్యివేస్తే' సినిమా ఆడియో వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందడి చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆడియో వేడుకలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నారా రోహిత్, నందమూరి తారకరత్న తదితరులు పాల్గొన్నారు. ఆడియో వేడుకలో పాల్గొనేందుకు నారా, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపారు. కాగా, ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక వర్గం పేర్కొంది. మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు కూడా హాజరుకావడం విశేషం.