: ‘పాక్’ కెప్టెన్ గా నేను అనర్హుడిని: అఫ్రిది
పాకిస్థాన్ కెప్టెన్ గా తాను అనర్హుడినంటూ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ఈరోజు టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై పాక్ ఓటమి అనంతరం అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్ జట్టుకు సారథ్యం వహించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని అన్నాడు. ఇటీవల భారత్ తో జరిగిన తమ మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చిన భారత్ అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ఆఫ్రిది రిటైర్మెంట్ గురించి పలు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై తన దేశ ప్రజల సమక్షంలో నిర్ణయం తీసుకుంటానని, పాక్ జట్టుకు దేనివల్ల మంచి జరుగుతుందో అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అఫ్రిది అన్నాడు.