: అమరావతి నిర్మాణానికి జపాన్ సంస్థ డిజైన్ ఎంపిక: సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి జపాన్ కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్ ను ఎంపిక చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాజధాని నగర భవన నిర్మాణాలపై ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతిని నిర్మించనున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి మూడు అంతర్జాతీయ సంస్థలు డిజైన్ లు సమర్పించాయని, అందులో మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్ ను ఎంపిక చేశామని అన్నారు. కాగా, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి భారత్ కు చెందిన డీవీ జ్యోషి, బ్రిటన్ కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ రిచర్డ్ రోజెస్, జపాన్ కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్ డిజైన్లను సీఆర్డీఏకు సమర్పించాయి. ఈ డిజైన్లలో తుది ఎంపిక కోసం ప్రభుత్వం ఒక జ్యూరీని నియమించింది. అందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం నిమిత్తం వచ్చిన ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించిన జ్యూరీ ఫైనల్ గా మాకీ అండ్ అసోసియేట్స్ సమర్పించిన డిజైన్ ను ఎంపిక చేసింది.