: బ్రస్సెల్స్ నుంచి మన వాళ్లు క్షేమంగా వచ్చేశారు!
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగిన బాంబు దాడుల తర్వాత... అక్కడ చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణికులు 214 మంది శుక్రవారం స్వదేశానికొచ్చారు. వీరందరినీ ప్రత్యేక జెట్ విమానంలో ఢిల్లీకి తరలించారు. విమానాశ్రయంలో తమ వారిని రిసీవ్ చేసుకున్న బంధుమిత్రులు ... వారిని గుండెలకు హత్తుకుని, ఉద్వేగంతో ఆనంద బాష్పాలు రాల్చారు. మనవాళ్లని స్వదేశానికి చేర్చే క్రమంలో భారత రాయబారి జేఎస్ ముకుల్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాడి నేపథ్యంలో బ్రస్సెల్స్లో ఇంకా భయాందోళనలు కొనసాగుతూనే వున్నాయి. తనిఖీల్లో భాగంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడి జరిగిన బ్రస్సెల్స్ విమానాశ్రయం రేపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.